రాజ్ దూత్ మూవీ రివ్యూ
on Jul 12, 2019
నటీనటులుః
మేఘాంశ్ శ్రీహరి, నక్షత్ర, కోట శ్రీనివాసరావు, ఆదిత్య మీనన్, రవివర్మ, మనోబాల, నల్లవేణు, ఏడిద శ్రీరామ్, దేవిప్రసాద్ తదితరులు
సాంకేతిక నిపుణులుః
బేనర్ః లక్ష్య ప్రొడక్షన్స్
సంగీతంః వరుణ్ సునీల్
నేపథ్య సంగీతంః జెబి
నిర్మాతః ఎమ్ ఎల్ వి సత్యనారాయణ
దర్శకత్వంః అర్జున్- కార్తిక్
విలన్ గా పరిచయమై హీరోగా ఎదిగిన రియల్ హీరో రియల్ స్టార్ లేట్ శ్రీహరి. ఆయన చిన్న కొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతూ రూపొందిన సినిమా `రాజ్ దూత్`. అర్జున్ కార్తిక్ లను దర్శకులుగా పరిచయం చేస్తూ ఎమ్ ఎల్ వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. నక్షత్ర హీరోయిన్ గా నటించింది. మరి రియల్ స్టార్ శ్రీహరి తనయుడు అనగానే మామూలుగానే ఆ సినిమా పై హోప్స్ ఉంటాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుటుందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
స్టోరిః
సంజయ్ ( హీరో మేఘాంశ్ శ్రీహరి) అనిష్ కురువిల్లా కూతరు నక్షత్ర ని లవ్ చేస్తాడు. మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని అనిష్ కురువిల్లా ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు సంజయ్ . నీ పట్టుదల నచ్చింది కానీ , విపరీతమైన యాటిట్యూడ్ , ఆవారాగా తిరిగే నీకు మా అమ్మాయిని ఇచ్చి ఎలా పెళ్లి చేయాలంటాడు అనీష్. హీరో సరే ఏం చేస్తే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు చెప్పండంటాడు. సరే మా ఫాదర్ కోమాలో ఉన్నారు ...ఆయనకు ఆపరేషన్ చేస్తే మామూలు మనిషివుతాడట..కానీ కోమాలోంచి బయటపడ్డాక ఆయకు ఇష్టమైంది కళ్లముందు ఉంచాలట ...మా నాన్నకు రాజ్ దూత్ బైక్ అంటే ప్రాణం... ఆ బైక్ తెచ్చి ఇవ్వగలవా అంటాడు. అంతేనా చాలా ఈజీ కదా చేసేస్తా అంటాడు. . అసలు ఆ బైక్ ఎక్కడుంది? అసలు ఉందా? లేదా? ఆ బైక్ కోసం హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు? చివరకు ఆ బైక్ తేగలిగాడా? లేదా? అసలు ఆ బైక్ స్టోరి ఏంటన్నది అసలు సినిమా.
విశ్లేషణః
దర్శకులు తీసుకున్న పాయింట్ తీసివేయదగ్గదేమీ కాదు. కానీ దాన్ని చెప్పిన విధానమే ఆసక్తికరంగా, ఆకట్టుకునే విధంగా లేదనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆ లైన్ లో బోలెడ్ స్టఫ్ ఉంది. కానీ దర్శకులు చాలా నార్మల్ సీన్స్ తో రెగ్యులర్ గా కథని నడిపించారు తప్ప. ఎక్కడా ప్రేక్షకుడిని కథకు కనెక్ట్ చేయలేకపోయారు. ఆ బైక్ చేతులు మరెన్నో ఊళ్లు మారుతూ వస్తుంది. అలా చేతులూ, ఊళ్ళూ మారే క్రమంలో సన్నివేశాలు చాలా పేలవంగా , నీరసంగా సాగుతాయి తప్ప, ఒక సస్పెన్స్, థ్రిల్ అనేది ఎక్కడా కనిపించదు. ఇక ఫస్టాఫ్ అంతా ఇలా స్టఫ్ లేని సన్నివేశాలతో సాగుతూ, ఎంట్రవెల్ పడుతుంది. ఇక సెకండాఫ్ లోకి వచ్చే సరికి కథ కర్నూలుకి షిప్ట్ అవుతుంది. ఆ బైక్ రాజన్న అనే ఓ పేరు మోసిన వ్యక్తి దగ్గర ఉంటుంది. ఆ బైక్ ను ఆ ఊరంతా గుడి కట్టి పూజిస్త్తారు. ఇక ఆ బైక్ ను రాజన్నను , ఆ ఊరిని ఎదిరించి తీసుకెళ్లడం కష్టం అనుకున్న హీరో రాజన్న ను మెప్పించి తీసుకెళ్లాలనుకుంటాడు. ఆ బైక్ ను పక్క రాజన్న ఆపోజిషన్ వాళ్లు ఎత్తుకెళ్లి తగలబెట్టాలనుకుంటారు. అక్కడ హీరో కు ఆ బైక్ ఎంత అవసరమో రాజన్న కు తెలియజెప్పే బలమైన సన్నివేశం అది. దాన్ని కాస్త చాలా సింపుల్ గా తేల్చేసారు. ఇక ఎప్పుడైతే హీరోయిన్ తన తండ్రిని ఆ బైక్ కోసం సంజయ్ ని ఎందుకు రిస్క్ లో పెట్టావు అని నిలదీయడంతో ...అది హీరో తాతయ్య బైక్ అని, అతని కోసమే ఆ బైక్ తీసుకురమ్మని పంపాను అనడంతో అసలు ట్విస్ట్ తెలుస్తుంది. కానీ హీరో రాజన్నకే నాకన్న బైక్ అవసరం ఎక్కువ అని వట్టి చేతులతో వస్తాడు. ఇలా ప్రీ క్లైమాక్స్ లో కొంత సెంటిమెంట్ వర్కవుట్ అయింది. మేఘాంశ్ మాత్రం తన ఫస్ట్ సినిమాతో బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సీనియర్ నటుడు మనోబాల ట్రాక్ మహా బోర్.
సినిమాకు ప్లస్ పాయింట్స్:
మేఘాంశ్ శ్రీహరి నటన
సెకండాఫ్ లో కొన్ని సెంటిమెంట్ సీన్స్
సినిమాకు మైనస్ పాయింట్స్:
ఫస్టాప్ వీక్ నేరేషన్
మనోబాల ట్రాక్
పాటలు
నటీనటుల పనితీరుః
మేఘాంశ్ శ్రీహరి బద్దకస్తుడుగా, బలాదూర్ గా తిరిగే కుర్రాడుగా సంజయ్ పాత్రలో చాలా ఎనర్జీతో నటించాడు. తనకిది తొలి సినిమా అయినా ఎక్కడా కొత్త కుర్రాడన్న ఫీలింగ్ రాకుండా ఎక్స్ పీరియన్స్ ఆర్టిస్ట్ లా ఎంతో ఈజ్ తో చేసాడు. హీరోగా నిలబడే అవాకాశాలు తనలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే కీర్తి సురేష్ పోలికలతో హీరోయిన్ నక్షత్ర తన పాత్ర కొంచెమే అయినా ఉన్నంత వరకు బాగా చేసింది. ఇక కమెడియన్ సుదర్శన్ తన తనదైన శైలిలో డైలాగ్స్ పలుకుతూ నవ్వించాడు. రాజన్న గా ఆదిత్య మీనన్, అనీష్ కురువిల్లా, రవివర్మ ఏడిదశ్రీరామ్ వారి పాత్రలకు న్యాయం చేసారు.
సాంకేతిక నిపుణుల పనితీరుః
పాటలు పెద్దగా ఏమీ ఆటక్టుకునే విధంగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ ఓకే. దర్శకులు రైటర్స్ కావడంతో వారి నుంచి ఇంకా ఆకట్టుకునే డైలాగ్స్ ఆశించడంలో తప్పేం లేదు. దర్శకత్వంలో మెరుపులు కనిపించకపోయినా, వారు అనుకున్నది మాత్రం ఎక్కడా తడబడకుండా కథను కథగా మాత్రం చూపించారు. ఇక నిర్మాత సత్యనారాయణ ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టారు.
తెలుగువన్ ప్రోస్పెక్టివ్ః
మంచి లైన్ తీసుకుని దర్శకులు దాన్ని మామూలు సినిమాగా మలిచారు. సెకండాఫ్ లో వచ్చే మలుపు, కొన్ని సెంటిమెంట్ సీన్స్ , మేఘాంశ్ నటన, సుదర్శన్ కామెడీ ఆకట్టుకుంటుంది. ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళితే తప్ప ..ఎక్స్ పెక్టేషన్స్ తో వెళితే బోర్ ఫీలవుతారు.
రేటింగ్ః 2.25/5