గన్ మిస్ ఫైర్... రాజశేఖర్‌కి గాయాలు!!
on Nov 17, 2018
అవును గన్ మిస్ ఫైర్ అవడంతో హీరో రాజశేఖర్ కి గాయాలయ్యాయట. కానీ అది షూటింగ్ లో వాడే డమ్మీ గన్ కావడంతో పెద్దగా గాయాలేమీ కాలేదు. చిన్న గాయాలే కావడంతో ట్రీట్ మెంట్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారట డాక్టర్స్. ఇంత కీ ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందనే కదా మీ డౌటు ...ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళితే.... రాజశేఖర్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. గన్ తో షూట్ చేసే సీన్ ఒకటి సినిమాలో ఉందట. విలన్ గ్యాంగ్ పై హీరో రాజశేఖర్ షూట్ చేసే సీన్ అల. ఈ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు గన్ మిస్ ఫైర్ అయిందట. రియల్ గన్ , బుల్లెట్స్ తో షూటింగ్ చేయరు కాబట్టి డమ్మీ బుల్లెట్ భుజానికి తగిలిందట. దీంతో సెట్ లో అంతా టెన్షన్ పడ్డారట. వెంటనే రాజశేఖర్ ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్ ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో షూటింగ్ క్యాన్సిల్ చేయడం ఇష్టం లేని రాజశేఖర్ లొకేషన్ కి వెళ్లి తన సిన్సియారిటీని చాటుకున్నారు.