బూతు డైరెక్టర్ తో రాజశేఖర్!
on Jun 28, 2016
ఇప్పుడంటే "యాంగ్రీ యంగ్ మెన్" అనగానే ఓ పదిమంది దాకా కథానాయకుల పేర్లు వినిపిస్తున్నాయి కానీ.. దశాబ్ధం క్రితం అలా "యాంగ్రీ యంగ్ మేన్" అని చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది రాజశేఖర్ మాత్రమే. ముఖ్యంగా పోలీస్ పాత్రల్లో రాజశేఖర్ నటన, కోపంతో ఆయన చూపే హావభావాలు ఈ రెంటినీ హైలైట్ చేసే సాయికుమార్ పవర్ ఫుల్ వాయిస్, ఈ మూడు కలగలిసి రాజశేఖర్ ను స్టార్ హీరోను చేశాయి. అయితే.. ఈమధ్యకాలంలో రాజశేఖర్ కు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. విలన్ రోల్స్ వచ్చినప్పటికీ.. "నేను హీరో" అని మంకుపట్టి పట్టుకొని కూర్చొని ఉండడం వల్ల ఆ ఆఫర్ల్లు వచ్చినదారినే వెళ్లిపోయాయి. ఆఖరికి గోపీచంద్ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకొని ఆ క్యారెక్టర్ కోసం రెడీ అవుతున్న రాజశేఖర్ కు చాన్నాళ్ల తర్వాత హీరో ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది.
ఇటీవల "గుంటూర్ టాకీస్" అనే పరమబూతు సినిమాను తెరకెక్కించి, కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకొన్న ప్రవీణ్ సత్తారు ప్రత్యేకించి రాజశేఖర్ పోలీస్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఒక డిఫరెంట్ "కాప్ స్టోరీ" రెడీ చేసుకొని రాజశేఖర్ కు వినిపించాడట, కథ విపరీతంగా నచ్చేయడంతో.. మరో ఆలోచన లేకుండా వెంటనే ప్రవీణ్ కథను ఒకే చేసేశాడత రాజశేఖర్. ఈ సినిమా సెట్స్ కు ఎప్పుడు వెళ్తుందో తెలియదుగానీ.. రాజశేఖర్ ను చాన్నాళ్ల తర్వాత మళ్ళీ పవర్ పోలీస్ గా చూసే అదృష్టం మాత్రం తెలుగు ప్రేక్షకులకు దక్కడం ఖాయం!