రాజ్ తరుణ్ యమాడేంజర్!
on Jun 28, 2016
ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలనుకున్న సినిమాకు హీరోగా మారి వరుసగా మూడు హిట్స్ తో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు హీరో రాజ్ తరుణ్. చిన్న నిర్మాతలు రాజ్ తరుణ్ తో సినిమా చేయడానికి మక్కువ చూపుతుంటారు. ఇప్పుడు రాజ్ తరుణ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో రెండు చిత్రాలకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించనున్నారు. 'ఈడో రకం ఆడో రకం` తర్వాత మరో సినిమా సెట్ పైకి తీసుకు వెళ్ళలేదు రాజ్ తరుణ్. దిల్ రాజు సంస్థలో 'శతమానం భవతి' అనుకున్నారే కానీ కొన్ని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు నుండి డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు మరో కాంబినేషన్ తో కొత్త సినిమా ప్రకటించాడు రాజ్ తరుణ్. మారుతి కథ . . స్క్రీన్ ప్లే అందించే ఈ సినిమాకి సంజన దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. ఈ చిత్రానికి టైటిల్ రాజుగాడు. క్యాప్షన్ యమా డేంజర్. యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని, రాజ్ తరుణ్ కి ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని నిర్మాత తెలియజేసారు.