బిగ్‌బాస్‌లో ప్రేమకథ బూటకమే!
on Nov 6, 2019
‘‘నేను డేట్‌కి పిలిస్తే పునర్నవి రానని చెప్పింది. మా మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్ లేదు. ఆ అమ్మాయి జీవితంలో మరో వ్యక్తి (అబ్బాయి?) ఉన్నారు. తనంటే నాకు గౌరవం. మేమిద్దరం మంచి స్నేహితులం’’ – ఇదీ తాజా ఇంటర్వ్యూలో పునర్నవి భూపాలం గురించి ‘బిగ్ బాస్ 3’ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ చెప్పిన మాటలు! దీంతో ‘బిగ్ బాస్ 3’లో ప్రేమకథ బూటకమేననీ, ఓ కట్టుకథ అనీ స్పష్టమైంది.
షో టిఆర్పి కోసమే ‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, హీరోయిన్ పునర్నవి భూపాలం మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందన్నట్టు చూపించే ఎత్తుగడ వేశారని భావించాల్సి వస్తుంది. రాహుల్ కంటే ముందే పునర్నవి హౌస్ నుండి బయటకొచ్చింది. మీడియా హౌస్‌లకు పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అరకొరగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రాహుల్ గురించి ప్రశ్నించగా... మా మధ్య ఏమీ లేదని ముసి ముసి నవ్వులు నవ్వింది. కానీ, ఏదో ఉందన్నట్టు లుక్కులు ఇచ్చేది. ‘బిగ్ బాస్ 3’ గ్రాండ్ ఫినాలేలో నాగార్జున కూడా వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని కలరింగ్ ఇచ్చారు. ‘‘తన ఫేవరెట్ కంటెస్టెంట్ పునర్నవి’’ అని శ్రీకాంత్ చెప్పగా... ‘‘శ్రీకాంత్ ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. అందుకని కనెక్ట్ అయ్యాడు’’ అని వెంటనే నాగార్జున అన్నారు. తీరా షో పూర్తయ్యాకా... అదంతా తుస్ అని తేలింది.
Also Read