రివ్యూయర్స్‌పై రగిలిన రఘు కుంచే.!
on Jul 1, 2020
మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే కలత చెందాడు. ఆవేదనతో రగిలిపోయాడు. తను సంగీతం సమకూర్చిన సినిమాను విమర్శిస్తూ రివ్యూలు రాసినవాళ్లపై ధ్వజమెత్తాడు. సత్యదేవ్ హీరోగా ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసిన 47 డేస్ అనే సినిమా ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై నేరుగా విడుదలైంది. ఈ సినిమాను కొంతమంది తమ రివ్యూలలో విమర్శించారు. బాగా లేదని తేల్చేశారు. దీంతో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆ రివ్యూయర్స్‌పై ధ్వజమెత్తిన రఘు కుంచే సుదీర్ఘ ట్వీట్లతో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆయన ఏం రాశాడో ఆయన మాటల్లోనే...
"Good morning Everyone.. End of the Day movie choosina vallandaru Good Movie అని చెప్తున్నారు ( సామాన్య ప్రేక్షకులు )... నిన్న కొంతమంది బాల మేధావులు రాసిన reviwes దెబ్బకి theatrical relz అయివుంటే ఈ పాటికి దుకాణం సర్దేసేది ఈ సినిమా."
"OTT అవడం వల్ల , options కూడా తక్కువ ఉండడం వల్ల చాలామంది చూడటం జరిగింది , చూసినవాళ్లందరూ అన్నది ఒకే మాట ... బానే ఉందిగా - మరీ అంత దారుణంగా ఎందుకు రాసారు అని ... End of the day ZEE5 TELUGU VIEWS REPORT కూడా చాలా SATISFIED గా ఉంది ..."
"weekday ఐనా సరే ... ఈ విషయంలో సామాన్య ప్రేక్షకులందరికీ Thanku so much .. చీల్చి చెండాడిన వాళ్లందరికీ కోటి దండాలు."
"నిన్నటి నుంచి చాలామంది industry లోని శ్రేయోభిలాషులు call చేసి వదిలేయ్ Raghu .. ఏం ఉపయోగం ఉండదు ..దీనివల్ల నీకు future లో problemsy గాని అంతకు మించి జరిగేదేం లేదు ... అని హెచ్చరిస్తున్నారు ..."
"అవును కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే ఎవరో వొచ్చి ఎడమ కాలితో తన్నేసి ....మౌనంగా ఉండిపోవాలి అంతేగా.."
"జరుగుతున్న నష్టం మీకు అర్థం కావడం లేదన్నా. నీ వ్యూస్ కోసం నువ్వు తాపత్రయపడుతున్నావ్. నీ సైట్ ట్రెండింగ్‌లో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావ్. కానీ సినిమా సంకనాకి పోయిందన్నా. 70% సినిమా వాళ్లు పనిలేక దిక్కుమాలిన స్థాయిలో ఉన్నారన్నా. నష్టపోతానేమో అని తెలిసి కూడా కనీసం ఏదో కిందా మీదా పడి సినిమా చేసి నలుగురికి అన్నం పెట్టే నిర్మాతని బతికిద్దాం అన్నా. "
"నలుగురికి అన్నం పెట్టి తను ఒక ముద్ద తిందాం అని అనుకునేవాడు, నువ్వేం రాస్తావో, నువ్వేం చెపుతావో అని బిక్కుబిక్కుమంటూ భయపడుతూ కూర్చోవాలా అన్నా. నీ రాతలకి మానసికంగా చచ్చిపోయి, సినిమా రిలీజ్ రోజు ఎవరికీ కనపడకుండా, మొహం దాచుకుని కుమిలి కుమిలి ఏడవాలా అన్నా. అసలు పగ ఏంటన్నా.. సినిమా ఉంటేనే నువ్వు - నేను. ఆ ఒక్క విషయం నువ్ టైప్ చేసేటపుడో, చేయించేటపుడో ఒక్కసారి గుర్తుపెట్టుకో అన్నా చాలు. నష్టం జరిగితే నీ కంట్లోంచి ఐనా నా కంట్లోంచి ఐనా వొచ్చేది ఒకటే కన్నీరు అన్నా."
"రూపాయి పెట్టి సినిమా తీసిన నిర్మాత ఆ రూపాయి వొస్తాదో రాదో అని బేల ముఖo వేసుకుని చూస్తుంటే -- ఆ రూపాయి సినిమాని, నువ్ Netflix లో రాత్రి చూసిన 10 రూపాయిల సినిమాతో పోల్చుకుని.... ఈ రూపాయి సినిమాని నీ వేళ్ళతో పొడిచేస్తున్నావ్ చూడన్నా...అదన్నా... నీ మేధస్సు. "
"ఎక్కువ చేస్తున్నాడు అని అనుకుంటున్నావు కాదన్నా... అవునన్నా... నిన్న నా స్థానంలో నువ్వుంటే, నా కడుపు మంట నీకు బాగా అర్ధం అయ్యేది అన్నా... పర్లేదు అన్నా Future లో నువ్ ఎలాగూ torture పెడతావ్ ... దానికి సిద్దపడే ఉన్నా అన్నా."