కమల్ విలన్ లారెన్స్?
on Mar 7, 2021
'ఖైదీ', 'మాస్టర్' చిత్రాలతో తమిళ, తెలుగు భాషల్లో సంచలనం సృష్టించిన దర్శకుడు లోకేశ్ కనకరాజ్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో 'విక్రమ్' చేస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ వేసవిలో థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో మల్టిటాలెంటెడ్ రాఘవ లారెన్స్ కూడా నటిస్తున్నాడని సమాచారం. అంతేకాదు.. 'విక్రమ్'లో ప్రతినాయకుడి పాత్ర అతనే చేస్తున్నాడని.. తనకది నెవర్ సీన్ బిఫోర్ రోల్ అని వినికిడి. కమల్ పాత్రకు దీటుగా లారెన్స్ రోల్ ఉంటుందని.. తన కెరీర్ లో గుర్తుండిపోయే వేషం ఇదని కోలీవుడ్ టాక్. త్వరలోనే 'విక్రమ్'లో రాఘవ లారెన్స్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.