'పక్కా కమర్షియల్' వకీల్‌గా మారుతున్న ఏంజెల్ ఆర్న!
on Apr 14, 2021
ఒకవైపు గ్లామరస్ రోల్స్ లో కనువిందు చేస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ లోనూ తనదైన ముద్ర వేస్తోంది ఉత్తరాది భామ రాశీ ఖన్నా. 'ఊహలు గుసగుసలాడే', 'తొలిప్రేమ' చిత్రాల్లో తన అభినయంతో అలరించిన ఈ సొగసరి.. 'సుప్రీమ్', 'ప్రతిరోజూ పండగే' వంటి సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో వినోదాలు పంచింది.
ఇదిలా ఉంటే.. మరోసారి ఈ టాలెంటెడ్ బ్యూటీ నటనకు అవకాశమున్న పాత్రలో సందడి చేయనుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి 'పక్కా కమర్షియల్' పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాయికగా రాశీఖన్నా నటిస్తోంది. అంతేకాదు.. ఈ చిత్రంలో వకీల్ రోల్లో దర్శనమివ్వనుంది రాశి. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఈ పాత్రతో రాశికి నటిగా మరింత గుర్తింపు రావడం ఖాయమని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
మరి.. 'సుప్రీమ్'లో బెల్లం శ్రీదేవి క్యారెక్టర్‌తో, 'ప్రతిరోజూ పండగే'లో ఏంజెల్ ఆర్నా పాత్రతో భలేగా ఎంటర్టైన్ చేసిన రాశి.. 'పక్కా కమర్షియల్'లో వకీల్‌గా ఏ స్థాయిలో మురిపిస్తుందో తెలియాలంటే అక్టోబర్ 1 వరకు వేచిచూడాల్సిందే.
Also Read