`పుష్ప`.. యాక్షన్ సీక్వెన్సెస్ కి అంత మొత్తమా?
on Apr 17, 2021
ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం `పుష్ప`. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నారు. `ఆర్య`, `ఆర్య 2` తరువాత బన్నీ, సుక్కు కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో మాలీవుడ్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నారు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ని అందించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే.. బన్నీ బర్త్ డే సందర్భంగా ఇటీవల రిలీజ్ చేసిన `ఇంట్రడ్యూజింగ్ పుష్పరాజ్` వీడియోని గమనిస్తే ఓ విషయం స్పష్టమవుతోంది. అదేమిటంటే.. బన్నీ నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించడమే కాకుండా, యాక్షన్ సీక్వెన్స్ సరికొత్తగా ఉండబోతున్నాయన్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బడ్జెట్ లో దాదాపు రూ. 40 కోట్ల వరకు కేవలం పోరాట ఘట్టాలకే కేటాయించారని తెలిసింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న `పుష్ప`ని యూనిట్ ఎంత గ్రాండియర్ గా విజువలైజ్ చేస్తుందో.
కాగా, ఆగస్టు 13న `పుష్ప` థియేటర్స్ లో సందడి చేయనున్నది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ `పుష్ప`కి బాణీలు అందిస్తున్నారు.