ఇస్మార్ట్ టైటిల్‌తో పూరి!!
on Jan 3, 2019
పూరి జగన్నాథ్ టైటిల్స్ ఎంత డిఫరెంట్ గా ఉంటాయో..ఆయన సినిమాల్లోని హీరో క్యారక్టరైజేషన్స్ కూడా అంత డిఫరెంట్ గా ఉంటాయి. గన్ లాంటి యారగెన్సీ, గ్రాటిట్యూడ్ తో కూడిన యాటిట్యూడ్ తో యమా స్పీడుగా ఉంటాడు పూరి హీరో. తాజాగా రామ్ తో పూరి జగన్నాథ్ ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిలో తో పాటు రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. `ఇస్మార్ట్ శంకర్` డ్యూయల్ దిమాక్ హైదరాబాది గా రామ్ లుక్ అదిరింది అంతే. ఇప్పటి వరకు లవ్ స్టోరీస్ తో అలరించిన రామ్ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ క్యారక్టర్ చేయబోతున్నాడని ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. ఒక హైదరాబాదీ కుర్రాడి కథని పూరి తన స్టైల్ లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో పూరి స్టైలిష్ టేకింగ్ తో ఇస్మార్ట్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారని పోస్ట్ ర్ చూసిన వారంతా అంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ సినిమాను పూరి జగన్నాథ్ పతాకంపై పూరి, చార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్ న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇద్దరికీ కూడా ఈ సినిమా ఎంతో కీలకంగా మారడంతో ఎంతో కేర్ తీసుకుని చేస్తున్నట్లు తెలుస్తోంది.