క్రేజీ కాంబినేషన్ లో సినిమా!!
on Dec 15, 2018
డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ గత కొంత కాలంగా సరైన సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. తన ప్రతి సినిమాతో నిరాశ పరుస్తూనే ఉన్నాడు. తన కొడకుకి కూడా `మెహబూబా` చిత్రంతో అపజయాన్ని ఇచ్చాడు. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలన్న కసితో ఉన్నాడట. అయితే ప్రస్తుతం రామ్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పూరి జగన్నాథ్ తర్వాతి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడట. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే...
అతి తక్కువ చిత్రాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నాడట పూరి జగన్నాథ్. ఇటీవల కాకినాడలో షూటింగ్ జరుగుతుండగా డియర్ కామ్రేడ్ చిత్రం షూటింగ్ జరుగుతుండగా లొకేషన్ కి వెళ్లి పూరి , విజయ్ కు ఓ స్టోరీ లైన్ వినిపించాడట. పూరి స్టోరీకి ఫ్లాటైన విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఒక డిఫరెట్ మేనరిజమ్ తో సినిమాలు చేసే విజయ్ ...హీరోని డిఫరెంట్ గా చూపిండంలో దిట్టైన పూరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అంటున్నారు సినీ జనాలు. నిజంగా ఈ కాంబినేషన్ లో సినిమా అంటే మరో పోకిరి సినిమాను ఊహించవచ్చు అనుకుంటా. చూద్దాం ఎలా ఉంటుందో మరి.