అడల్ట్ స్టార్ మీద లక్షలు అప్పనంగా పోసారు
on Nov 8, 2017
ఒక్కో సినిమాకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని సినిమాలు ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని తీస్తే, మరికొన్ని సినిమాలు ఇంకో తరగతి వ్యక్తుల మెప్పు కోసం తీసేవి. అయితే, కొందరు దర్శకులు తెలివిగా అన్ని వర్గాల్ని అలరించే క్రమంలో ఒక ప్రత్యేక గీతాన్ని ఇరికించడమో, భారీ లెవల్ యాక్షన్ సీన్ పెట్టడమో చేస్తారు. కొన్ని సార్లు ఈ ప్రయోగం మంచి ఫలితాల్ని ఇచ్చినా, చాలా సార్లు ఇది బెడిసికొట్టొచ్చు.
ఇక అసలు విషయానికి వస్తే, దర్శకుడు ప్రవీణ్ సత్తారు రాజశేఖర్‌తో గరుడ వేగ అనే సినిమా తీశారు. ఈ సినిమా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసింది. మరి మాస్‌లోకి సినిమా పోవాలంటే ఎలా అని ఆలోచించారో ఏమో కానీ, ప్రముఖ అడల్ట్ స్టార్ సన్నీ లియోన్ తో ఒక ఐటెం సాంగ్ చేసారు. ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడమే కాకుండా, ఆడియో లాంచ్ కి వచ్చి లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చినందుకు ఇంకొంచెం డబ్బులు వదిలించుకున్నారట.
ఇంతా పోతే ఆ సాంగ్ వల్ల సినిమాకి ఏమయినా ఒరిగిందా అంటే ఏమీ లేదు. ఇంకా చెప్పాలి అంటే, ఈ పాటే సినిమాకి పెద్ద మైనస్ అనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ సన్నీ లియోన్ కి ముట్టిన మొత్తం ఎంతో తెలుసా అక్షరాలా 60 లక్షలు. సన్నీ లియోన్ మొహం చూసి మాస్ సెంటర్లలో థియేటర్లకు వస్తారనుకున్న నిర్మాతల పథకం ఈ రకంగా బెడిసి కొట్టిందని చెప్పాలి.