అనిరుథ్ కి మైండ్ పోయిందట!
on Nov 8, 2017
తమిళ సంగీత దర్శకుడు అనిరుథ్ కి కళ్లు బయర్లు కమ్మాయ్. కాసేపు షాక్ లోనే ఉండిపోయాడు. మునుపెన్నడూ చూడని ఆదరణ తన పాటకు రావడం చూసి అనిరుథ్ నోట మాట రావడంలేదు. గతంలో ‘3’ సినిమా కోసం ధనుష్ తో పాడించి ‘కొలవెరి’ పాట ఈ స్థాయి స్పందన రావడానికి కొన్ని రోజులు పట్టింది. కానీ.. కేవలం 8 గంటల వ్యవధిలో మిలియన్ కి పైగా వ్యూస్ రావడంతో అనిరుథ్ ఆనందానికి పట్టపగ్గాల్లవ్.
అయితే.. ఈ తతంగంపై అనిరుథ్ కి ఓ స్వీట్ మెసేజ్ పెట్టాడు మరో సంగీత దర్శకుడు తమన్. ‘ఇది పవన్ స్టామినా. ఆయన స్టార్ డమ్ కి ఇదొక ట్రైల్ మాత్రమే. ప్రారంభమే ఇలా ఉంది. ఇక ముందు ముందు ఎలా ఉంటుందో చూస్కో’ అని పోస్ట్ పెట్టాడు. అంతేకాదు.. ’మనిద్దరం ఇంకా సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది’ అంటూ.. నర్మగర్భంగా ఇంకో పోస్ట్ కూడా పెట్టాడు. ఏది ఏమైనా పవర్ స్టార్ స్టామినా దెబ్బకి మన తమిళ తంబీలకు మెండ్ బ్లోయింగ్ అయ్యిందనే చెప్పాలి.