ప్రియాంక చోప్రాకు గాయాలు..
on Jan 14, 2017
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం క్వాంటికో టీవీ సీరియల్ లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సీరియల్ కు సంబంధించి షూటింగ్ జరుగుతండగా... ప్రియాంక చోప్రా స్వల్ప గాయాలపాలయ్యారు. ప్రియాంక చోప్రాకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు యూఎస్ఏ టుడే ప్రకటించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. కాకపోతే ప్రియాంకకు విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ప్రత్యేక వైద్య బృంద పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందించారు.