'నారప్ప' జోడీ సుందరమ్మ!
on Jun 4, 2020
సీనియర్ స్టార్ వెంకటేశ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'నారప్ప'. ధనుష్ హీరోగా నటించగా సూపర్ హిట్టయిన తమిళ చిత్రం 'అసురన్'కు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి క్రియేషన్స్ బ్యానర్లపై డి. సురేశ్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి మొదటిసారి ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్‌తో కలిసి నటిస్తున్నారు.
'నారప్ప' భార్య సుందరమ్మగా ప్రియమణి చాలా రోజులు మన తెలుగు వారికి గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ రోజు ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా సుందరమ్మగా ఆమె ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఎడ్లబండి మీద కూర్చొని గ్రామీణ మహిళగా కనిపిస్తోన్న ప్రియమణి లుక్ ఆకట్టుకుంటోంది. ఇదే తరహాలో మరెన్నో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని నారప్ప టీమ్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
సాంకేతిక బృందం:
కథ: వెట్రిమారన్
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యామ్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్ దొంకాడ
కో- ప్రొడ్యూసర్: దేవి శ్రీదేవి సతీష్
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
Also Read