తెలుగమ్మాయికి సూపర్ ఛాన్స్
on Apr 15, 2019
ప్రియా వడ్లమాని అంటే ప్రేక్షకులు గుర్తు పట్టడం కష్టమేమో! అదే గతేడాది ‘హుషారు’లో హిట్ సాంగ్ ‘ఉండిపోరాదే...’ పాటలో కనిపించిన అమ్మాయి అంటే ఠక్కున గుర్తుపడతారు!! ఆ హీరోయిన్ తెలుగమ్మాయే. ‘హుషారు’కు ముందు ‘శుభలేఖ+లు’, ‘ప్రేమకు రెయిన్ చెక్’ సినిమాల్లో నటించింది. ఇప్పుడీ అమ్మాయికి సూపర్ ఛాన్స్ వచ్చింది. విలక్షణ చిత్రాల దర్శకుడు రవిబాబు తీసే డ్రామా థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఆల్రెడీ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రయోగాలు కాకుండా థ్రిల్లర్స్ తీసిన ప్రతిసారీ రవిబాబు విజయాలు అందుకున్నారు. సో... ఈ సినిమాతో ప్రియా వడ్లమానికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. కాన్సెప్డ్ బేస్డ్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ థ్రిల్లర్‌లో ఆమె పాత్ర నేచురల్‌గా ఉంటుందట!