ENGLISH | TELUGU  

అజ‌య్ దేవ్‌గ‌ణ్ ప‌దేళ్ల కొడుకును మెచ్చుకున్న ప్ర‌ధాని మోడీ!

on Sep 18, 2020

 

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సెప్టెంబ‌ర్ 17న 70వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా  చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేశ్‌బాబు, అక్ష‌య్‌కుమార్‌, ఖాన్ త్ర‌యం స‌హా టాలీవుడ్‌, బాలీవుడ్ సెల‌బ్రిటీలు అనేక‌మంది సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ అజ‌య్ దేవ్‌గ‌ణ్ సైతం వారిలో ఉన్నాడు. చాలా మంది సెల‌బ్రిటీల విషెస్‌కు స్పందించిన ప్ర‌ధాని వారికి థాంక్స్ తెలియ‌జేశారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్ విషెస్‌కు ఆయ‌న స్పందించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. త‌న ట్వీట్‌లో ఆయ‌న దేవ్‌గ‌ణ్ ప‌దేళ్ల కొడుకు యుగ్ గురించి మాట్లాడ‌ట‌మే అందులోని విశేషం.

“Happy 70th Modiji More Power to you Sir. @narendramodi #HappyBirthdayPMModi.” అని విషెస్ తెలిపాడు అజ‌య్ దేవ్‌గ‌ణ్‌.

దీనికి స్పందించిన మోడీ,  “Delighted to receive your wishes. Was good seeing young Yug devoting his birthday towards a greener planet. Such awareness is commendable. @ajaydevgn.” (మీ శుభాకాంక్ష‌లు అందుకోవ‌డం సంతోషంగా ఉంది. యంగ్ యుగ్ త‌న బ‌ర్త్‌డేని ప‌చ్చ‌టి గ్ర‌హం దిశ‌గా అంకితం చేయ‌డాన్ని చూడ‌టం బాగుంది. ఇలాంటి అవ‌గాహ‌న ప్ర‌శంస‌నీయం) అని ట్వీట్ చేశారు.

అంటే ప‌దో బ‌ర్త్‌డేని యుగ్‌ ఎలా సెల‌బ్రేట్ చేసుకున్నాడో ప్ర‌ధాని చూశార‌న్న మాట‌. సెప్టెంబ‌ర్ 13న యుగ్ దేవ్‌గ‌ణ్ ప‌దో బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకున్నాడు. ఆ రోజు యుగ్ మొక్క‌ల‌ను నాటుతున్న పిక్చ‌ర్ల‌ను అజ‌య్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. వాటిని చూసిన ప్ర‌ధాని ఇప్పుడు యుగ్‌ను ప్ర‌శంసించారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.