"ప్రేమమ్" ఆడియో డేట్ ఫిక్సయ్యింది!
on Jun 28, 2016
మలయాళ సూపర్ హిట్ సినిమా "ప్రేమమ్"ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ తోపాటు మలయాళ వెర్షన్ లో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ లు కూడా కథానాయికలుగా నటిస్తున్నారు. "కార్తికేయ" ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ ఇటీవల పూర్తయ్యింది. రెండు పాటల చిత్రీకరణ కోసం నార్వే వెళ్లనున్నారు. గోపీ సుందర్ స్వరసారధ్యంలో రూపొందిన "ప్రేమమ్" పాటల విడుదల వేడుకను ఆగస్ట్ 7న హైద్రాబాద్ లో నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు అనుకొంటున్నారు.