ప్రభుదేవా రెండో పెళ్లి వివరాలివే...
on Nov 23, 2020
ప్రభుదేవా పెళ్లి ఒక ఫిజియోథెరపిస్ట్‌తో సెప్టెంబర్‌లో పెళ్లయ్యిందని ఇదివరకు తమిళ మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అది నిజం కాదనీ, అంతకంటే ముందే, మే నెలలోనే ఆమెను ప్రభుదేవా వివాహమాడాడనే వాస్తవం వెల్లడైంది. ఈ విషయాన్ని అతని సోదరుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం తెలియజేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఈ విషయం అతను చెప్పాడు. ముంబైకి చెందిన ఆ ఫిజియో పేరు డాక్టర్ హిమానీ. వెన్నునొప్పి, కాళ్లనొప్పులకు ఆమె వద్ద చికిత్స తీసుకుంటున్న సందర్భంగా ఆ ఇద్దరి మధ్య క్రమంగా ప్రణయం చోటు చేసుకుంది.
మేలో వారి వివాహం చెన్నైలో జరిగింది. అంతకంటే రెండు నెలల ముందు ఆ ఇద్దరూ మార్చిలో లాక్‌డౌన్ విధించడానికి ముందు చెన్నైలోని ప్రభుదేవా ఇంటికెళ్లారు. లాక్‌డౌన్ కాలంలో రెండు నెలల పాటు సహజీవనం చేశారు. ప్రభుదేవా నివాసంలో జరిగిన వారి పెళ్లికి కుటుంబసభ్యుల మాత్రమే హాజరయ్యారు. ప్రభుదేవా పెళ్లి విషయంలో తాము చాలా హ్యాపీగా ఉన్నామని రాజు సుందరం తెలిపాడు. ఇది ప్రభుదేవాకు రెండో వివాహం. ఇదివరకు రమ్‌లత్‌తో ఆయనకు వివాహం జరిగింది. ఆమెకు 2011లో విడాకులిచ్చాడు ప్రభుదేవా. దానికి ముందు కొంత కాలం నయనతారతో ఆయన సహజీవనం చేశాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
