English | Telugu

`సాహో` రిలీజ్ డేట్ ఫిక్సైంది!!

on Jul 19, 2019

ప్ర‌భాస్ ,శ్రద్ధ‌క‌పూర్ జంట‌గా  హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో తెర‌కెక్కుతోన్న `సాహో` చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కావాల్సింది కాస్తా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.  అయితే తాజాగా ఈ సినిమా ఆగ‌స్ట 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని యూవీ క్రియేష‌న్స్ సంస్థ అధికారికంగా ఈ రోజు ప్ర‌క‌టించింది. కంటెంట్ , క్వాలిటీ విస‌యంలో రాజీ పడ‌కూడ‌ద‌న్న అభిప్రాయంతో సాహో చిత్రం విడుద‌ల వాయిదా వేసిన‌ట్టు వెల్ల‌డించారు.

ఫైట్ సీక్వెన్స్ కు మ‌రింత టైమ్ అవ‌స‌రం ఉండ‌టంతో విడుద‌ల తేదీని  ఈనెల 15 నుంచి 30 కు మార్చిన‌ట్లు కూడా వెల్ల‌డించారు చిత్ర యూనిట్.  సుమార్ 300 కోట్ల బ‌డ్జెట్ తో వంశీ ప్ర‌మోద్ , విక్కీ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సుజీ త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, అరుణ్ విజ‌య్, ముర‌ళీ శ‌ర్మ‌, వెన్నెల కిషోర్, మ‌హేష్ మంజ్రేక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. మ‌రి ఈ సారైనా అనుకున్న స‌మ‌యానికే వ‌స్తుందా లేక మ‌ళ్లీ వాయిదా ప‌డుతుందా అన్న సందేహం టాలీవుడ్ లో మొద‌లైంది. చూద్దాం ఎలా ఉంటుందో మ‌రి.


Cinema Galleries



Latest News


Video-Gossips