'సలార్' ఆగమనం అప్పుడేనా?
on Jan 27, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో 'సలార్' ఒకటి. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మించనుంది. యాక్షన్ సాగాగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో శ్రుతి హాసన్ నాయికగా నటించనుందని సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న 'సలార్'.. మరికొద్దిరోజుల్లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో తొలి షెడ్యూల్ ఉంటుందని టాక్.
కాగా, శరవేగంగా సినిమాని పూర్తి చేసి ఈ సంవత్సరం విజయదశమికి రిలీజ్ చేయాలని తొలుత యూనిట్ భావించింది. అయితే ఇప్పుడా ఆలోచన మారిందని.. 2022 సంక్రాంతికి 'సలార్' థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందని టాక్.
దసరా సమయంలో 'ఆర్ ఆర్ ఆర్' వంటి మరో భారీ బడ్జెట్ మూవీ విడుదలవుతుండడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇక దీపావళికి తీసుకువద్దామనుకుంటే.. అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 'అణ్ణాత్తే' రాబోతోంది. అందుకే.. సంక్రాంతినే టార్గెట్ చేసుకున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రావచ్చు.