English | Telugu

ప్రభాస్ మధ్యలోనే జంప్!

on Nov 13, 2018

 

 

ఆర్ఆర్ఆర్‌ ఓపెనింగ్‌కు ప్ర‌భాస్ వ‌చ్చాడు. రామ్‌చ‌రణ్‌, ఎన్టీఆర్‌, రానా, రాజ‌మౌళితో స‌ర‌దాగా కబుర్లు చెబుతున్న సమయంలో తీసిన ఫొటో ఒకటి బయటకు వదిలారు. ఓపెనింగ్ వీడియోలోనూ అందరూ ఒక్క చోట వున్నప్పుడు మాత్రమే కనిపించాడు. పూజా కార్యక్రమాల్లో లేడు. చివర్లో అందరూ కలిసి దిగిన గ్రూప్ ఫొటోలో లేడు. ఇంకెక్కడా కనిపించలేదు. చిత్ర పరిశ్రమలో, ప్రేక్షకుల్లో ఈ విషయం చర్చకు వచ్చింది. ఫైనల్ ఫొటోలో ప్రభాస్ ఎందుకు లేడు అనేది. విషయం ఏంటంటే... ఆర్ఆర్ఆర్‌ ఓపెనింగ్‌లో ప్ర‌భాస్‌ పట్టుమని పాతిక నిమిషాలు కూడా లేదట! అవును... కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయాడట! అందరికీ ఓసారి హాయ్ చెప్పేసి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. ఎందుకు? ఏమిటి? అనే వివరాలు తెలియలేదు. బహుశా... మీడియాను ఆహ్వానిస్తే ఇటువంటి విషయాలు ఎక్కువ హైలైట్ అవుతాయని రాజమౌళి బృందం  అలోచించి మీడియాను దూరంగా పెట్టినట్టు వున్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here