ప్రభాసూ! నీకు పుణ్యముంటది.. పెళ్లి చేసుకోనాయనా!
on Dec 16, 2017
ఊళ్లో పెళ్లయితే... వాటికి వేటికో... హడావిడట. సోషల్ మీడియా వ్యవహారం అలాగే ఉంది. ఆయనెవరో పెళ్లి చేసుకోపోవడం ఏంటీ.. కనబడ్డ అమ్మాయిలందర్నీ తీసుకెళ్లి ఆయనతో వీళ్లు పెళ్లి చేసేయడమేంటీ..... ఏంటో వీరి పిండము. ఎంత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయితే మాత్రం.. ఇళ్లలో ఉన్న ఆడకూతుళ్లను తీసుకొచ్చి ఈయనగారికి లింకులు పెట్టి రాసేస్తే... ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంత బాధ పడతారు? ఆ మాత్రం జ్ఙానం లేదా.. వీరి శ్రార్థము. వీళ్లకు ఆ మాత్రం అక్షింతలు అవసరమే లేండి. లేకపోతే...ఏంటీ చత్త రాతలూ? ప్రభాస్ కి పెళ్లంట. నాగబాబు కూతురు నిహారిక పెళ్లి కూతురట.
ఇంతకు మించిన దారుణం ఏమైనా ఉంటుందా చెప్పండి? 39 ఏళ్ల ప్రభాస్ ఎక్కడా? నిండా పాతికేళ్లు లేని నిహారిక ఎక్కడ? అసలు ఈడూజోడూ చూసుకోరా? చిన్న పిల్లల్ని కూడా అంటగట్టేస్తారా? ఇదెక్కడి దారుణం. నాగబాబు, నిహారికలకు పెళ్లి చేస్తే బావుంటుందని స్వయంగా కృష్ణంరాజే వెళ్లి చిరంజీవిని అడిగాడట. చిరంజీవి కూడా అందుకు ‘ఓకే’ చెప్పేయడంతో దాదాపు పెళ్లి ఖరారైపోయిందట. ఇది మేటర్. ఎంత మేటర్లు లేకపోతే మాత్రం... ఇలాంటివి క్రియేట్ చేస్తారా? బాబూ... ప్రభాస్ నువ్వు త్వరగా పెళ్లి చేసుకో నాయనా? గతంలో త్రిషతో లింకుపెట్టారు, తర్వాత శ్రియతో పెళ్లంటూ హంగామా చేశారు. మొన్నేమో అనుష్క. నిన్నేమో శ్రద్దా కపూర్. నేడేమో... మరీ దారుణంగా చిన్నపిల్ల నిహారిక. ఇన్ని దారుణాలు జరుగుతుంటే అలా చూస్తూ కూర్చుంటావేమయ్యా.. ముందు ముందు ఇంకెంతమందిలో నీకు పెళ్లి చేస్తారో. అందుకే త్వరలో పెళ్లి చేసుకోవయ్యా... పాపం అమ్మాయిల్ని కాపాడు.