ప్రభాస్20 కొత్త టైటిల్ ఏంటంటే?
on Feb 6, 2020
ప్రస్తుతం ప్రభాస్ ఓ ప్రేమకథా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాకు 'జాన్' టైటిల్ అనుకున్నారు. అయితే... తమిళ హిట్ '96' తెలుగు రీమేక్ లో హీరోయిన్ సమంత పేరు జాను అలియాస్ జానకి. తమిళంలో కూడా హీరోయిన్ పేరు అదే. అక్కడ త్రిష ఆ పాత్ర చేశారు. తెలుగు విషయానికి వస్తే... హీరోయిన్ పేరును సినిమా టైటిల్ గా పెట్టాలని అనుకున్నారు. చూస్తే... ప్రభాస్ సినిమాకు 'జాన్' అనే టైటిల్ అప్పటికే ప్రచారంలో ఉంది. అందుకని, ఆ సినిమా చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అధినేత లో ఒకరైన వంశీని 'దిల్' రాజు కలిశారు. మీరు అనుమతి ఇస్తే... తమ చిత్రానికి 'జాను' టైటిల్ ఖరారు చేయాలని అనుకుంటున్నట్లు రిక్వెస్ట్ చేశారు. ప్రభాస్ తో పాటు నిర్మాతలు కూడా దిల్ రాజుకు అనుమతి ఇచ్చారు. సో... ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు.
శర్వానంద్, సమంత జంటగా దిల్ రాజు నిర్మించిన '96'కి 'జాను' టైటిల్ ఖరారు చేయడంతో ప్రభాస్ కొత్త టైటిల్ చూసుకుంది. 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్, పూజ హెగ్డే జంటగా యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి 'ఓ డియర్' టైటిల్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫిల్మ్ చాంబర్ లో కూడా ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారని టాక్.