విన్నారా? అనుష్క లేడీ రెబల్ స్టార్ అట!
on Nov 9, 2019
అనుష్కకు, నాకు ఎలాంటి సంబంధం లేదు మొర్రో అని ప్రభాస్ ‘సాహో’ ఇంటర్వ్యూల్లో నెత్తి నోరు బాదుకున్నాడు. హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు... ఏ నగరానికి వెళ్లినా ఏదో ఒక ఇంటర్వ్యూలో ‘అనుష్కతో మీ రిలేషన్ ఏంటి?’ అనే క్వశ్చన్ ఎదురైంది. ప్రతిసారీ ఓపిగ్గా ఏమీ లేదని సమాధానం ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో అయితే ‘అనుష్క’ను తొందరగా పెళ్లి చేసుకోమని చెప్పాలి. అప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు’ అన్నాడు. అనుష్క అయితే ఇటువంటి ప్రశ్నలు అవాయిడ్ చేస్తుంది. వీళ్లిద్దరూ ఇంత గట్టిగా చెబుతున్నా కొందరు ప్రభాస్ అభిమానులు మాత్రం అత్యుత్సాహానికి పోతున్నారు. అనుష్కను లేడీ రెబల్ స్టార్ అంటూ కీర్తిస్తున్నారు. ‘నిశ్శబ్దం’ టీజర్ కింద కామెంట్లు చూసినా, సోషల్ మీడియాలో కొందరు ప్రభాస్ అభిమానుల పోస్టులు చూసినా ఈ విషయం తెలుస్తుంది. కృష్ణంరాజుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ అని బిరుదు. ఆయన వారసుడిగా ప్రభాస్ వచ్చారు. కృష్ణంరాజు తమ్ముడి కొడుకు కనుక, ప్రభాస్‌కు యంగ్ రెబల్ స్టార్ బిరుదు ఇచ్చారు పరిశ్రమ ప్రముఖులు, ప్రేక్షకులు. ఇప్పుడు కొందరు అనుష్కను లేడీ రెబల్ స్టార్ చేసేశారు. వాళ్ల మీనింగ్ ఏంటో అర్థమైంది కదూ!