ప్రభాస్ ఎందుకిలా మాట్లాడుతున్నాడు?
on Aug 26, 2019
'సాహో' సృష్టించబోయే రికార్డులు లెక్కలు వేసుకోవాలని, రాసుకోవాలని రెబల్ స్టార్ అభిమానులు రెడీగా ఉన్నారు. కానీ, ప్రభాస్ మాటలు వింటుంటే.. అతడు మాత్రం అంత రెడీగా ఉన్నట్టు లేడు. 'సాహో' విజయంపై ప్రభాస్ కు నమ్మకం లేదా? లేదా సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలను తగ్గించడానికి మాట్లాడుతున్నాడా? అసలు, ప్రభాస్ ఎందుకిలా మాట్లాడుతున్నాడు? అనేది వీరాభిమానులకు అర్థం కావడం లేదు. "బాహుబలి రికార్డులను 'సాహో' దాటితే ఆనందమే కానీ దాటుతుందని ఎలా అనుకుంటాం? బాహుబలి తొలి భాగం సంగతి పక్కన పెడితే... రెండో భాగం దేశవ్యాప్తంగా భయంకరమైన క్రేజ్ మధ్య విడుదలైంది. ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూశారు. ఆ సినిమా రికార్డులు దాటుతుందో? లేదో? చూద్దాం" అని ప్రభాస్ అంటున్నాడు. 'సాహో' అవుట్ ఫుట్ మీద కాన్ఫిడెంట్ గానూ మాట్లాడటం లేదు. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలంటూ సందేశాలు వ్యక్తం చేస్తున్నాడు. రెండేళ్లుగా సినిమా చేస్తుండటం వల్ల తెలియకుండా దాంతో ప్రేమలో పడతామని, ఫలితాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని ప్రభాస్ అంటున్నాడు. మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా విడుదలకు ముందు ఈ విధంగా మాట్లాడటం ఓపెనింగ్ వీకెండ్ తరవాత వచ్చే ప్రేక్షకులపై ప్రభావం చూపుతుందేమో? 'సాహో' యూనిట్ ఆలోచించుకోవాలి.