ప్రభాస్ తగ్గడం మొదలు పెట్టాడట!
on Nov 25, 2020
'ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు'! - 'అత్తారింటికి దారేది' చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్. మన హీరోలు అందరూ చాలా గొప్ప వాళ్ళు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో తెలుసుకుని అందుకు తగ్గట్టు తమ ఫిజిక్ మార్చుకుంటూ ఉంటారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విషయం చూడండి...
'బాహుబలి' కోసం ప్రభాస్ బరువు పెరిగాడు. ఆ తర్వాత 'సాహో' కోసం కొంత తగ్గాడు. ప్రస్తుతం 'రాధే శ్యామ్' సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా రూపొందుతున్న మైథలాజికల్ ఫిలిం 'ఆదిపురుష్' షూటింగ్ స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. అందులో ప్రభురామ్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు.
వెండితెరపై రాముడిగా కనిపించడం కోసం ప్రభాస్ బరువు తగ్గే పని మొదలు పెట్టాలని తెలిసింది. ప్రస్తుతం తన ఫిజిక్ మీద ప్రభాస్ దృష్టి పెట్టాడట. వచ్చే ఏడాది సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఆగస్టు 8 2022 లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్రలో నటించబోయే కథానాయికగా ఎంపిక చేయవలసి ఉంది.
Also Read