పవన్ సైకిలెందుకు ఎక్కాడు..?
on Dec 12, 2017
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమా అజ్ఞాతవాసి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, పవన్ లుక్స్, లిరికల్ వీడియోస్ అన్ని సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ఎంతసేపు ఇవేనా..? టీజర్ సంగతేంటీ బాసూ.. అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది.. ఈ నెల 16న అజ్ఞాతవాసి టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ కొత్త పోస్టర్‌ను అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
"బెల్ట్ నోట్లో పెట్టుకుని.. సైకిల్‌పై వెళుతున్న పవన్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. చూస్తుంటే హడావిడిగా పవన్ ఆఫీసుకు వెళ్లడమో లేదంటే ఏదైనా ఫైట్ సీన్" లోని స్టిల్‌ను కట్ చేసినట్లుగా అనిపిస్తోంది. హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీని.. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. పవన్ సరసన కిర్తీ సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా.. అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నారు.