English | Telugu

పోస్టర్ రివ్యూ: ఆజ్ఞాతవాసి

on Nov 24, 2017

త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంభినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది పవన్ 25వ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. అసలే బెస్ట్‌ ఫ్రెండ్, పైగా అతనికి మైల్డ్ ‌స్టోన్ లాంటి మూవీ కావడంతో త్రివిక్రమ్ దీనిలో ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ పెట్టి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ సినిమాకు టైటిల్ పెట్టలేదు.. ప్రస్తుతానికి ఆజ్ఞాతవాసి అన్న వర్కింగ్ టైటిల్‌తో పని కానిచ్చేస్తున్నారు. మరి అసలు టైటిల్ ఏంటీ..? ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారు అని సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. వీటన్నింటికి సమాధానం అతి త్వరలో తెలిసిపోనుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక ప్రీ రిలీజ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ఈ లుక్‌లో పవన్ అటు వైపుగా తిరిగి బ్లాక్ షేడ్‌లో కిటికి అద్దాలలోంచి సూర్యుడిని చూస్తున్నాడు. ఆయన ముఖం మాత్రం కనిపించడం లేదు. అయితే సినిమా ఫస్ట్‌లుక్ నవంబర్ 27న రిలీజ్ చేస్తున్నామని.. అదే రోజున టైటిల్‌ను ఎనౌన్స్ చేయనున్నారు. ప్రజంట్ ఈ పోస్టర్‌‌ను తెగ షేర్ చేస్తూ.. లైకులు కొడుతూ పవర్‌స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here