పవన్ "అజ్ఞాతవాసి" ఆ సినిమాకు కాపీ అట!
on Nov 9, 2017
ప్రతి సారి కొత్త కథలు ఎక్కడ్నుంచి పుడతాయ్ చెప్పండి? పాత కథల్లోని పాయిట్ నే తీసుకొని కొత్తగా తీసేస్తే ఏ బాధా ఉండదు. ప్రస్తుతం అందరూ చేస్తున్న పనే అది. ఆ మాటకొస్తే ఒకప్పుడు కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు అలాగే చేస్తున్నారు. రేపు కూడా జరిగేది ఇదే.
ఇప్పుడున్న జనరేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇలా పాత కథల్ని కొత్తగా మలచడంలో దిట్ట అని చెప్పాలి. తన రెండో సినిమా ‘అతడు’ సినిమా లైన్.. యాజిటీజ్ గా వెంకటేశ్ ‘వారసుడొచ్చాడు’ ది.
మొన్న ‘ఆ ఆ’ అని తీశాడు. ఆ సినిమా లైన్.. యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘మీనా నవలది. దాన్ని మక్కీకి మక్కీ దించేశాడు త్రివిక్రమ్. తద్వారా విమర్శలను కూడా అందుకున్నాడు. .ఇదే కథతో విజయనిర్మల గతంలో సినిమా చేసింది కూడా.
ముచ్చటగా మూడో సారి ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు త్రివిక్రమ్. పవన్ కల్యాణ్ తో ప్రస్తుతం ఆయన చేస్తున్న ’అజ్ఞాతవాసి’ సినిమా గతంలో వెంకటేశ్ చేసిన ‘ఒంటరి పోరాటం’ కథ అట. ఆ సినిమాలో వెంకటేశ్ ఒంటరిగా పోరాటం చేసి గెలుస్తాడు. ఇందులో పవర్ స్టార్ కూడా అంతేనట. ఆ సినిమా జయసుధ.. వెంకీని ఆయుధంగా చేసుకొని అన్యాయంపై పోరాడుతుంది. ఇందులో ఆ పాత్రను ఖుష్బూ చేస్తోంది. ఐడెంటిటీ దాచి పెట్టి అజ్ఞాతంలో తిరిగే పాత్రగా పవన్ కనిపిస్తాడట. అందుకే ఆ రహస్య జీవితానికి తగ్గట్టుగానే అజ్ఞాతవాసి టైటిల్ పెట్టినట్టున్నారు. అదండీ అసలు విషయం.