పవన్ పేరు మార్చుకున్నాడా..? దేని కోసం..?
on Oct 3, 2017
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రి ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత తనమార్క్ యాక్టింగ్తో..సేవా కార్యక్రమాలతో అశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లోనే అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతటి పాపులారిటీ ఉన్న వ్యక్తి తన పేరు మార్చుకున్నాడు. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు..ప్రముఖ సెర్చింజిన్ గూగుల్. రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ వీకిపిడియాను గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన పేరుని కుశాల్ బాబు అని చూపిస్తోంది. ఇది చూసిన ఆయన అభిమానులు ఖంగుతింటున్నారు. ఇలా ఎందుకు జరిగిందో అర్థంకాక...పవన్ పేరు మార్చుకున్నాడని..కాదు కాదు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో పవన్ పేరు "కుశాల్ బాబు" అని..దానికి హైప్ తీసుకువచ్చేందుకే త్రివిక్రమ్ ఇలా చేశాడని రకరకాల ఊహాగానాలు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఒక్క గూగుల్లో తప్ప మిగిలిన అన్ని సెర్చింజిన్లలోనూ పవన్ కళ్యాణ్ పేరు యధావిధిగానే చూపిస్తోంది. మరి ఈ పేరు మార్పిడి వెనుక రహస్యం తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.