పవర్ స్టార్ చివరి సినిమా ఖరారు?
on Jul 15, 2017
పవర్ స్టార్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ బిజీ.. ఇంకో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్న కారణంగా... స్పీడ్ గా సినిమాలు చేసేస్తున్నారాయన. ఎన్నికలు వచ్చే లోపు సాధ్యమైనంత ఎక్కువ చిత్రాలు చేసేయాలనేది పవన్ కల్యాణ్ ఆలోచన. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే... మరో సినిమాకు కూడా పచ్చ జెండా ఊపేశారు పవర్ స్టార్.
ఆ సినిమాకు దర్శకుడు ఎవరనుకున్నారు? ‘కందిరీగ’ఫేం సంతోష్ శ్రీనివాస్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమానే ప్రస్తుతానికి పవర్ స్టార్ ఆఖరు సినిమా అని ఫిలింనగర్ టాక్. సంతోష్ శ్రీనివాస్ సినిమా తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో పవన్ బిజీ అవుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఎన్టీయార్... ఎన్నికలకు ముందు ‘నాదేశం’అనే విప్లవాత్మకమైన కథాంశంతో కూడుకున్న సినిమా చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించడమే కాక, ఎన్టీయార్ రాజకీయ రంగ ప్రవేశానికి ఘనంగా స్వాగతం పలికింది. మరి పవర్ స్టార్ కూడా ఎన్టీయార్ లాగే... ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మరి ఆయన కూడా ఎన్నికల ముందు తాను చేయబోయే సంతోష్ శ్రీనివాస్ సినిమాకు ఎలాంటి కథాంశాన్ని ఎంచుకుంటాడో చూడాలి.