ENGLISH | TELUGU  

పవన్‌కి బానిసనంటున్న కొబ్బరిమట్ట

on Aug 29, 2016

జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్‌కళ్యాణ్ తిరుపతి వేదికగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా పెద్ద దుమారం రేగుతోంది. పవన్ వ్యాఖ్యలను సమర్థించేవారు కొందరైతే..వ్యతిరేకించేవారు కొందరు. సినీ పరిశ్రమలో పవన్ అంటే పడిచచ్చేవారు చాలామందే ఉన్నా రాజకీయంగా పవన్‌కు మద్ధతు తెలిపేవారు తక్కువే. ఈ తరుణంలో పవన్‌కు సపోర్ట్‌గా
నిలిచాడు బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు. ట్విట్టర్ వేదికగా లెటర్ రాశారు..

 

నేను తెలంగాణలో పుట్టినా..నా సోదర తెలుగు రాష్ట్ర ప్రజలు కష్టంలో ఉన్నారని తెలిసి..వారి గుండెల్లో ఇంత ఆగ్రహం ఉందని పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ద్వారా తెలిసి గుండె బరువెక్కింది. రాష్ట్రాలు వేరైనా తెలుగు వారంతా ఒక్కటే. సీమాంధ్రుల బాధని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడికి..ముఖ్యంగా సినీ పరిశ్రమకు ఉందని సంపూ అన్నారు. వారు కొంటున్న టికెట్ డబ్బులతోనే మనం బ్రతుకుతున్నాం, పవన్ కళ్యాణ్ గారి ఉద్యమంలో నేను ఒక గొంతు అవుతున్నాను.  దీనివల్ల ఏ ఉపయోగం జరగకపోవచ్చు. కానీ, ఏమో నా వల్ల మరొకరు ధైర్యంగా ముందుకు రావొచ్చుగా… జైహింద్… సదా మీ ప్రేమకు బానిస… మీ సంపూర్ణేష్ బాబు…” అంటూ ట్వీట్ చేసారు.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.