అరుదైన రికార్డు అనుపమ సొంతం !!
on Feb 8, 2019
అనుపమ పరమేశ్వరన్.. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా ఉండే రూపం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఆ రూపంతోనే దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచిన ఈ కేరళ కుట్టి. తాజాగా తన ఖాతాలో ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే దక్షిణాదిలోనే అన్ని భాషల్లోనూ నటించడమే కాకుండా ఆయా భాషల్లో మొదటి సినిమాలతోనే మంచి విజయాలను అందుకోవడం. ఆ వివరాల్లోకి వెళితే అనుపమ తొలి మలయాళం చిత్రం `ప్రేమమ్ `(2015) బ్లాక్ బస్టర్ హిట్ కాగా, మొదటి తెలుగు చిత్రం `అ ఆ` (2016) ఘన విజయం సాధించింది. ఇక ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ `కొడి` (2016)కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. అంతేకాదు ఆమె తొలి కన్నడ చిత్రం `నటసార్వభౌమ` గురువారం (ఫిబ్రవరి 7) విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనుపమ పాత్ర. కథలో ఎంతో కీలకం కూడా. తన నటనతో కన్నడిగుల మనసు కూడా దోచేసిన అను. మొత్తం మీద తొలి చిత్రాల విషయంలో రేర్ ఫీట్ ని సొంతం చేసుకున్నట్లయ్యింది. కంగ్రాట్స్ టు బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రస్ అనుపమ పరమేశ్వరన్ !