'వకీల్ సాబ్'తో తెలుగమ్మాయి స్పెషల్ సాంగ్
on Apr 4, 2020
తెలుగమ్మాయి పూజితా పొన్నాడకు ఇదొక పెద్ద అవకాశమని చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమాలో, అదీ పవన్‌తో ప్రత్యేక గీతంలో నటించడం అంటే మామూలు విషయమా? ప్రస్తుతం 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్' చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అది కాకుండా క్రిష్ దర్శకత్వంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏయం రత్నం నిర్మిస్తున్న ఆ సినిమాలో పూజితా పొన్నాడ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. ఆల్రెడీ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశారట.
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడానికి ముందే హైదరాబాద్‌లో ఒక స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో నాలుగైదు రోజుల పాటు పవన్ కళ్యాణ్, పూజిత, కొంతమంది డ్యాన్సర్ల మీద సాంగ్ షూట్ చేశారట. జూలై నుండి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. మెగా ఫ్యామిలీలో హీరోలతో ఆమెకు రెండో సినిమా ఇది. ఇంతకు ముందు రామ్‌చరణ్ 'రంగస్థలం'లో నటించారు. ప్రకాష్ రాజ్ కుమార్తెగా, అదేనండీ ఆది పినిశెట్టి ప్రేమించిన అమ్మాయిగా నటించారు. పెద్ద సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూనే, చిన్న సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు.