'బంగారు బుల్లోడు' హీరోయిన్ కథలు... స్క్రీన్‌ప్లే!
on Jul 8, 2020
'అల్లరి' నరేష్ కొత్త సినిమాలలో ఒకటైన 'బంగారు బుల్లోడు' ఉంది కదా! రీసెంట్గా హీరో బర్త్‌డేకి టీజర్ విడుదలైంది. అందులో హీరోయిన్ పూజా జవేరి గుర్తుందా? ఆల్మోస్ట్ ఐదేళ్ల క్రితమే తెలుగులో 'భమ్ బోలేనాథ్' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయింది. విజయ్ దేవరకొండ సరసన 'ద్వారకా'లో నటించింది ఈ అమ్మాయే. అయితే, విజయాలు మాత్రం దక్కలేదు. ఇప్పుడీ హీరోయిన్ రైటింగ్ సైడ్ కాన్సంట్రేట్ చేస్తోంది.
పూజా జవేరిలో ఓ రైటర్ ఉన్నారట. లాక్డౌన్లో ఖాళీగా కూర్చోకుండా చిన్న చిన్న కథలు, కవితలు రాశానని ఆమె చెబుతోంది. అంతే కాదు... మూడు నెలలుగా ఓ కథకు స్క్రీన్ ప్లే కూడా రాశానని ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది. పూజా జవేరికి డైరెక్షన్ డ్రీమ్స్ కూడా ఉన్నాయి. అయితే, ప్రస్తుతానికి మెగాఫోన్ పట్టుకోవాడ్నైకి తాను రెడీగా లేనని చెప్పింది. ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ గా చేసి, డైరెక్షన్ గురించి తెలుసుకున్నాక చేస్తాననీ, ఎవరైనా తన కథలను స్క్రీన్ మీదకు తీసుకొస్తే సంతోషిస్తానని చెబుతోంది.
ఇటీవల 'జీ 5' ఓటీటీలో విడుదలైన '47 డేస్'లో పూజా జవేరి హీరోయిన్ గా నటించింది. త్వరలో 'ఆహా'లో రిలీజ్ కానున్న ఒక వెబ్ సిరీస్ లో నటించింది. 'అల్లరి' నరేష్ సరసన 'బంగారు బుల్లోడు' చేస్తోంది.
Also Read