ఆఖరికి పూజా హెగ్డే కూడా గరిటె తిప్పింది!
on Apr 6, 2020
కరోనా ప్రభావం వల్ల ప్రేక్షకులు ఎప్పుడూ చూడలేమనుకున్నవి చూస్తున్నారు. కథానాయికలు ఎప్పుడూ చేయలేమనుకున్నవి చేస్తున్నారు. అవే... వంటలు! ఫొటోషూట్లు, షూటింగులు, జిమ్ లో వర్క్ అవుట్లు, ఫారిన్ టూర్లు... సామాజిక మాధ్యమాలలో అందాల ముద్దుగుమ్మలు చెప్పే కబుర్లు ఇవే. కరోనా వల్ల ఇంట్లోనే ఉంటున్న వీరంతా ఇప్పుడు వంటింట్లోకి వెళ్ళి గరిటె తిప్పుతున్నారు.
హిందీలో దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, మలైకా అరోరా మొదలుకొని తెలుగులో రకుల్, తమన్నా, ఇలియానా వరకు అందరూ వంట చేసినవాళ్ళే. ఆఖరికి ఈ లిస్టులో పూజా హెగ్డే కూడా చేరారు. లాక్ టౌన్ మొదలైన తొలినాళ్ళలో గిటార్ నేర్చుకుంటూ, ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతూ సమయం గడిపిన ఆమె... రెండు రోజుల నుంచి వంటింట్లో ప్రయోగాలు చేస్తున్నారు. మొన్న క్యారెట్ హల్వా చేశారు. నిన్న ఆలూ టుక్ చేశారు. ఈ రోజు ఏం చేస్తారో మరి? లా టౌన్ పూర్తి అయ్యేలోపు హీరోయిన్లు అందరూ వంటలు చేయడంలో పర్ఫెక్ట్ అయిపోతారేమో?!
Also Read