పూజా హెగ్డే ఇన్‌స్టా టెన్షన్ ఖతమ్
on May 28, 2020
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను గురువారం రాత్రి ఎవరో హ్యాక్ చేశారు. హ్యాక్ చేసినవాళ్లు కొందరికి పూజా హెగ్డే అకౌంట్ నుండి డైరెక్టుగా మెసేజ్ లు చేయడం, ఆమె అకౌంట్ ఫాలో అయ్యేవాళ్ళను ఫాలో బ్యాక్ చేయడం వంటివి చేశారు. దాంతో వెంటనే పూజా హెగ్డే అప్రమత్తం అయ్యారు.
"అందరికి హాయ్. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని మా డిజిటల్ టీమ్ చెప్పింది. హ్యాకర్స్ నుండి అకౌంట్ ను వెనక్కి తీసుకొచ్చే పనిలో మా టీమ్ హెల్ప్ చేస్తోంది. ఒకవేళ ఏవైనా ఇన్విటేషన్స్ వస్తే యాక్సెప్ట్ చేయకండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వకండి" అని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు పూజా హెగ్డే తెలిపారు. తర్వాత ఒక గంట పాటు నిర్విరామ కృషితో టెక్నికల్ టీమ్ హ్యాకర్స్ బారినుండి పూజా హెగ్డే అకౌంట్ ను కాపాడారు. దాంతో ఆమె ఊపిరి తీసుకున్నారు. ఇన్‌స్టా టెన్షన్ ఖతమ్ అయింది.
"గంట పాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సేఫ్టీ గురించి చాలా టెన్షన్ పడ్డాను. రాత్రి వేళలో హెల్ప్ చేసిన నా టెక్నికల్ టీమ్ కి థాంక్స్. ఫైనల్లీ... నా అకౌంట్ నా చేతిలోకి వచ్చింది. హ్యాకర్స్ చేసిన మెసేజ్ లు అన్నీ డిలేట్ చేస్తాం. ఎవరైనా ఫాలో అయితే అన్ ఫాలో కొడతాం" అని పూజా హెగ్డే పేర్కొన్నారు.