పూజా అందాలు అదుర్స్... డబ్బింగ్ బెదుర్స్?
on Sep 17, 2018
"టఫ్‌గా కనిపిస్తారు కానీ... మాట వింటారు. పర్లేదు" - 'అనగనగా' పాటకు ముందు పూజా హెగ్డే చెప్పిన డైలాగ్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాకి హీరోయిన్ పూజా హెగ్డే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి'కి హీరోయిన్లు కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ చేత త్రివిక్రమ్ డబ్బింగ్ చెప్పించారు. 'అరవింద సమేత..'కి అదే పద్దతి పాటిస్తున్నారు. అయితే... పూజా హెగ్డే గొంతు ఎలా వుందో ప్రేక్షకులకు తెలియడానికి అన్నట్టు శాంపిల్‌గా ఓ డైలాగ్ వదిలారు. దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ అమ్మాయి గొంతు అలా వుందేంటి? అని కామెంట్స్ వినపడుతున్నాయి. అమ్మాయి అందానికి, అమ్మాయి గొంతుకు అసలు సంబంధం లేదంటున్నారు. నిజంగా ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ కోసం ఈ డైలాగ్ విడుదల చేసినట్టయితే అర్జెంటుగా మరొకరి చేత డబ్బింగ్ చెప్పించడం మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. త్రివిక్రమ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరి??