పదిహేడు గంటలు... హౌస్ఫుల్లోనే!
on Oct 26, 2018
ఒక్కటి చెయ్యి కూడా ఖాళీ లేదు... పూజా హెగ్డే రెండు చేతులూ ఫుల్. ఒక్క రోజు కూడా ఖాళీగా వుండటం లేదు... వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. రోజులో 24 గంటలు వుంటే... పదిహేను, పదిహేడేసి గంటలు సినిమా సెట్లోనే వుంటోంది. ఈ ఏడాది తెలుగులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి.
ఒకటి... 'సాక్ష్యం', రెండు... 'అరవింద సమేత వీరరాఘవ'. ఈ రెండూ కాకుండా ఐటమ్ గాళ్‌గా నటించి 'రంగస్థలం' ఒకటి విడుదలైంది. ప్రస్తుతం ఆమె చేతిలో మహేష్ బాబు 'మహర్షి', ప్రభాస్ హీరోగా కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమాలు వున్నాయి. హిందీలో 'హౌస్‌ఫుల్4' చేస్తుంది. మొత్తం మీద మూడు భారీ సినిమాలు ఆమె చేతిలో వున్నాయి. ఒక సినిమాకు, మరో సినిమాకు షెడ్యూల్ క్లాష్ కాకుండా ఛార్టెడ్ ఫ్లైట్‌లో ట్రిప్స్ వేసి మరీ పూజా హెగ్డే షూటింగ్ చేసిన సందర్భాలు వున్నాయి. ఇప్పుడు ఏకంగా రోజుకు పదిహేడు గంటలు షూటింగ్ చేసింది. ప్రజెంట్ ముంబయ్‌లో 'హౌస్‌ఫుల్4' షూటింగ్ జరుగుతోంది. గురువారం ఉదయం షూటింగ్ స్టార్ట్ చేస్తే... ఎప్పుడో మిగ్ నైట్ కంప్లీట్ అయ్యిందని పూజా హెగ్డే సోషల్ మీడియాలో చెప్పింది. మొత్తం పదిహేడు గంటలు హౌస్‌ఫుల్ సెట్లో వున్నానని తెలిపింది. పూజా హెగ్డే డైరీ ఫుల్. అందువల్ల, హౌస్ ఫుల్!!