ఒళ్లును విల్లులా వంచిన అందాల పూజ!
on Jul 10, 2020
'అరెరే చంద్రకళ... జారేనా కిందికిలా' అని 'ముకుంద' సినిమాలో ఒక పాట ఉంది. అందులో వరుణ్ తేజ్, పూజా హెగ్డే స్టెప్పులు వేశారు. పాటలో హీరోయిన్ను చంద్రకళగా హీరో వర్ణిస్తాడు. లేటెస్ట్గా పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే 'అరెరే నెలవంక... వచ్చిందా నేలకు ఇక' అన్నట్టు ఉన్నాయి.
ఫిట్నెస్ అంటే ప్రాణం ఇచ్చే హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. సన్నజాజిలా చక్కగా ఉండటానికి కారణం అదే. లాక్‌డౌన్‌లోనూ ఫిట్నెస్ను పూజా హెగ్డే పక్కన పెట్టలేదు. జిమ్‌కి వెళ్లి వర్కవుట్స్ చేయడం కుదరడం లేదు కనుక ఆన్లైన్లో కోచ్ నుండి క్లాసులు తీసుకుంటున్నారు. ఇంట్లో వర్కవుట్స్ చేస్తున్నారు. అలాగే, యోగా కూడా. గురువారం ఆమె యోగా చేశారు. ఆ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఒళ్లును విల్లులా వంచుతూ పూజా హెగ్డే వేసిన ధనుర్ ఆసన అయితే ప్రేక్షకులు నోరెళ్ళబెట్టి చూసేలా ఉంది. లాక్డౌన్లో ఫిట్నెస్ విషయంలో ప్రజలకు రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే వంటి తారలు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Also Read