`ఆర్ ఎక్స్` భామతో బాలయ్య !!
on May 15, 2019
పాయల్ రాజ్ పుత్ `ఆర్ ఎక్స్ 100` సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో నటించి బోల్డ్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ భామ ప్రస్తుతం వెంకటేష్ సరసన `వెంకీమామ` చిత్రంలో నటిస్తోంది. అలాగే `డిస్కోరాజా` లో రవితేజ కు జోడీగా నటిస్తోంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం మరో సీనియర్ హీరో సినిమాలో నటించే అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వివరాల్లోకి వెళితే... నందమూరి నటసింహం బాలకృష్ణ , కె.యస్.రవికుమార్ కలయికలో సి.కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `రూలర్` అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా హరిప్రియ నటించనుందట. ఈ నెల 17న లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.
Also Read