పాయల్ ఖాతాలో మరొకటి
on Apr 21, 2021
`ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెరపై మెరిసిన ఉత్తరాది సోయగం పాయల్ రాజ్ పుత్. తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ ని మూటగట్టుకున్న ఈ అమ్మడు.. ఆ తరువాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. విక్టరీ వెంకటేశ్, మాస్ మహారాజా రవితేజ వంటి స్టార్స్ తో కలిసి నటించినా కెరీర్ కి పెద్దగా ప్లస్సవలేదు. ఈ నేపథ్యంలో.. ఫీమెల్ సెంట్రిక్ ఫిల్మ్స్ వైపు దృష్టి పెట్టింది పాయల్. ఈ క్రమంలోనే.. `5Ws` అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో పోలీస్ పాత్రలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా పాయల్ ఓ పంజాబీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో తన అభిమాన కథానాయకుడు గిప్పి గ్రేవాల్ తో కలిసి నటించబోతోంది పాయల్. కాగా, పంజాబీలో నటించడం పాయల్ కి
ఇదే తొలిసారి కాదు. ఇదివరకు మరాఠి చిత్రం `సైరాట్`కి రీమేక్ అయిన `చెన్న మెరేయ`తో పాటు `మిస్టర్ అండ్ మిసెస్ 420 రిటర్న్స్`, `మ్యారేజ్ ప్యాలెస్`, `ఇష్కా` వంటి పంజాబీ మూవీస్ లో పాయల్
సందడి చేసింది. మరి.. స్వల్ప విరామం అనంతరం చేస్తున్న పంజాబీ చిత్రం పాయల్ కెరీర్ కి ఏ మేరకు ప్లస్సవుతుందో చూడాలి.