English | Telugu

షకలక శంకర్‌కి పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్...!

on Jul 12, 2018

కొన్నాళ్ల క్రితం షకలక శంకర్ అంటే కేవలం రామ్‌గోపాల్‌వర్మని అనుకరించే ఓ చిన్న నటుడిగానే అందరికీ తెలుసు. క్రమంతా జబర్దస్త్‌తో కమేడియన్ అన్న గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే కొన్ని సినిమాల్లోనూ ఛాన్స్ కొట్టేశాడు. తాజాగా ‘శంభో శంకర’తో హీరోగానూ స్థిరపడ్డాడు. శంభో శంకర హిట్‌ అని చిత్ర యూనిట్‌ చెప్పుకొన్నా, అది బాక్సాఫీస్‌ దగ్గర యావరేజ్ సినిమాగానే నిలిచిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే... శంకర్ తాజాగా ఓ గత అనుభవం గురించి ఏదో మీటింగ్‌లో చెప్పుకొచ్చాడు.

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌లో శంకర్ నటించిన విషయం తెలసిందే! ఆ సినిమా షూటింగ్‌ సందర్భంగా రీల్‌ మరీ ఎక్కువ ఖర్చవుతోందనీ, దానివల్ల నిర్మాత పవన్‌ కళ్యాణ్‌కు డబ్బులు వృధా అయిపోతున్నాయని తెగ ఫీల్‌ అయిపోయాడట శంకర్. దాంతో అక్కడి అసిస్టెంట్‌ డైరక్టర్‌ని పలిచి ఓ క్లాస్‌ పీకాడట. విషయం తెలిసిన పవన్ కళ్యాణ్‌ `అప్పుడే డైరెక్ట‌ర్లను, కో-డైరెక్ట‌ర్ల‌ను తిట్టే రేంజ్‌కు వ‌చ్చావా. వాళ్లు ఎన్ని సార్లు తీస్తే నీకెందుకు? ఎంత డ‌బ్బు పెడితే నీకెందుకు? నీ లిమిట్స్‌లో నువ్వుండు, నీ ప‌ని చేసుకుని నువ్వు వెళ్లిపో,’ అంటూ శంకర్‌ను పిలిపించి వాయించేశాడట.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here