`వకీల్ సాబ్`.. లెంగ్త్ ఎక్కువే!
on Apr 3, 2021
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్` (2016) ఆధారంగా రూపొందిన చిత్రం `వకీల్ సాబ్`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీగా తెరకెక్కిన ఈ కోర్ట్ డ్రామాని.. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ తీర్చిదిద్దారు. `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. `పింక్` చిత్ర నిడివి 136 నిమిషాలు (2 గంటల 16 నిమిషాలు) కాగా.. `వకీల్ సాబ్` మాత్రం కాస్త లెంగ్తీగానే తయారయిందని ఫిల్మ్ నగర్ టాక్. తెలుగు నేటివిటికి తగ్గ మార్పులు, పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని సన్నివేశాల చేర్పులు, పాటలు.. ఇలా పలు అంశాలు `వకీల్ సాబ్`ని 154 నిమిషాల (2 గంటల 34 నిమిషాల) సినిమాగా మలిచాయని సమాచారం. త్వరలోనే `వకీల్ సాబ్` డ్యూరేషన్ పై క్లారిటీ వస్తుంది.
`వకీల్ సాబ్`లో పవన్ కి జంటగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్, అంజలి, అనన్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించారు. మరి.. భారీ అంచనాల మధ్య వస్తున్న `వకీల్ సాబ్`.. పవన్ కి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read