అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందా.. పవన్???
on Apr 14, 2018
రంగస్థలం సక్సెస్ మీట్లో పవన్ కల్యాణ్ స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన సినిమా వేడుకల్లో నోరు తెరవని పవన్... చరణ్ సినిమాని ఇంతలా ఎందుకు వెనకేసుకొచ్చాడా అనిపిస్తుంది. `చరణ్ నా తమ్ముడు` అని చెప్పాడు కాబట్టి... పవన్ కితాబుల్ని ఆ కోణంలో చూసి ఓకే అనుకోవొచ్చు. కాకపోతే ఈసినిమాని ఆస్కార్‌కి పంపాలని, లేదంటే అన్యాయం చేసినవాళ్లం అవుతామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశాడు పవన్. అంతేనా? బాహుబలిని ఎలా ప్రోత్సహించామో, ఈ సినిమానీ అలానే వెన్నంటి ఉండి నడిపించాలని చెప్పాడు. బాహుబలికీ, రంగస్థలం సినిమాకీ లింకేంటి?? అనేది సగటు సినీ అభిమాని అనుమానం. కాకపోతే కాకి పిల్ల కాకికి ముద్దు కాబట్టి - రంగస్థలం సినిమా బాహుబలి సినిమా రేంజులో ఆనేసింది మన పవర్ స్టార్‌కి.
రంగస్థలం సక్సెస్ మీట్లో పవన్ స్పీచు విన్నవాళ్లెవరికైనా మరో అనుమానం అర్జెంటుగా వేసేస్తుంది. ఇన్ని కబుర్లు ఇప్పుడు చెబుతున్న పవన్‌కి బాహుబలి సమయంలో కూడా ఇలానే మాట్లాడాలన్న సంగతి గుర్తుకు రాలేదా?? అని. బాహుబలి ఎంతటి గొప్ప విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. దేశం యావత్తూ ఈసినిమా గురించి మాట్లాడింది. జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. కానీ అవేం పవన్‌కి పట్టలేదు. ఈ సినిమా గురించి ఎప్పుడూ మాట్లాడింది లేదు. అంతెందుకు.. శుక్రవారమే బాహుబలికి మూడు జాతీయ అవార్డులు ప్రకటించారు. ఆ విషయాన్ని వేదికపై గుర్తు చేసున్నా బాగుండేది. బాహుబలి సమయంలో కనీసం నోరు మెదపని పవన్.. ఇప్పుడు రంగస్థలాన్ని రాజకీయాలకు, వర్గాలకూ అతీతంగా ప్రోత్సహించాలని చెప్పడం విడ్డూరంగా మారింది. అన్నయ్య కొడుకు సినిమా కాబట్టి అంత ప్రేమొచ్చేసిందా... మరొకరు సినిమా తీస్తే.. ఏమాత్రం పట్టదా? ఇదెక్కడి న్యాయం పవన్..??