English | Telugu

ప‌వ‌న్‌ని దెబ్బ‌కొట్ట‌డానికి.. ఓ ర‌హ‌స్య అస్త్రం!

on Apr 14, 2018


తెలుగు రాజ‌కీయాల్లో మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో.. ప‌వ‌న్ క‌ల్యాణ్ `డిసైడ‌ర్‌`గా నిల‌వ‌బోతున్నాడ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల జోస్యం. ప‌వ‌న్ అధికారంలోకి రాక‌పోయినా ఓట్ల‌ని చీల్చ‌డంలో ప్ర‌ముఖ పాత్ర వ‌హించ‌బోతున్నాడ‌న్న‌ది విశ్లేష‌కుల సారాంశం. టీడీపీతో వైరం పెంచుకుని... ఇప్పుడు ఆ పార్టీకి విరోధిగా మారాడు ప‌వ‌న్‌.  టీడీపీ తిరుగులేని ఆధిప‌త్యం చెలాయించే గోదావ‌రి జిల్లాల్లో ప‌వ‌న్ ప్ర‌భావం చాలానే ఉంది. అక్క‌డ టీడీపీకి రావాల్సిన ఓట్ల‌లో క‌నీసం కొన్న‌యినా ప‌వ‌న్ లాక్కెళ్లిపోతాడు. అందుకే ప‌వ‌న్ జోరుకి అడ్డుక‌ట్ట వేయాల‌ని అటు టీడీపీ, ఇటు వైకాపా భావిస్తున్నాయి. ప‌రోక్షంగా ప‌వ‌న్‌పై దాడి చేసి - అత‌ని పాపులారిటీ త‌గ్గించాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఎవ‌రికి వాళ్లు త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓ ర‌హ‌స్య అస్త్రాన్ని సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆమె ఎవ‌రో కాదు.. పూన‌మ్ కౌర్‌. పూన‌మ్‌కీ ప‌వ‌న్‌కీ ద‌గ్గ‌ర సంబంధాలున్నాయ‌ని ఆ మ‌ధ్య వార్త‌లొచ్చాయి. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా నా ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని క‌త్తి మ‌హేష్  సైతం చెప్పుకొచ్చాడు. ఆ త‌ర‌వాత‌.. ఆ విష‌యం స‌ద్దుమ‌ణిగింది. ఇప్పుడు పూన‌మ్ కౌర్‌ని రంగంలోకి దింపి ప‌వ‌న్ క‌ల్యాణ్ నిజ స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టాల‌ని ఓ ఛాన‌ల్ ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్పుడు శ్రీ‌రెడ్డి ఇష్యూ ఎలా హాట్ టాపిక్ అయ్యిందో.. అలా పూన‌మ్ విష‌యాన్ని హాట్ టాపిక్‌గా మార్చాల‌ని ఓ ఛాన‌ల్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, త్వ‌ర‌లోనే పూన‌మ్ టీవీల ముందుకొచ్చి. కొన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్ట‌బోతోంద‌ని తెలుస్తోంది. అవ‌న్నీ ప‌వ‌న్‌ని కార్న‌ర్ చేయ‌డానికే అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల టాక్‌. మ‌రి పూన‌మ్ బ‌య‌ట‌కు వ‌చ్చి ఏం చెబుతుందో, ప‌వ‌న్‌ని ఎలా ఇరుకున పెడుతుందో చూడాలి.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here