ENGLISH | TELUGU  

తేజ్ అప్ సెట్... అర్థరాత్రి పవన్ క్లాస్..

on Feb 14, 2018

 

చిన్న మామ పవన్ కళ్యాణ్ లోని ఈజ్ ను, పెద్ద మామ డ్యాన్స్ లోని గ్రేస్ ను చూసి మెగా ఫ్యామిలో మరో తిరగులేని స్టార్ వచ్చాడనుకున్నారు. ఆ హీరో ఎవరనకున్నారు.. ఇంకెవరు.. సాయిధరమ్ తేజ్...కానీ సీన్ రివర్స్ అయింది. కెరీర్ లో తీసిన మొదటి సినిమా "రేయ్" చాలా రోజుల వరకూ రిలీజ్ కు నోచుకోలేదు. ఆ తరువాత తీసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ దక్కించుకున్నాడు. ఇక ఆతరువాత వచ్చిన రెండు మూడు సినిమాలు తప్పించి.. మిగిలిన సినిమాలు మొత్తం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాడు. దీంతో వరుస ఫ్లాప్‌లతో ఇప్పుడు సాయిధరమ్ తేజ్  సందిగ్ధంలో పడ్డాడు. ఇక మేనల్లుడు అవస్థ చూసిన పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగినట్టు టాక్ వినిపిస్తుంది. తొలిప్రేమ సినిమాతో తనకు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన కరుణాకరన్ కు తేజ్ బాధ్యత అప్పగించినట్టు తెలుస్తోంది. కరుణాకరన్ కు పవన్ అర్థరాత్రి ఫోన్ చేసి కథపై గురించి తీవ్రంగా చర్చించారట. సాయిధరమ్ తేజ్ మూవీ ప్రాజెక్ట్ గురించి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ అందించాలని.. ఏదో మొక్కుబడిగా సినిమా తీయవద్దని కరుణాకరన్‌కు పవన్ సూచించారట. సాయిధరమ్ తేజ్‌కు తప్పనిసరిగా హిట్ అందించాలన్నారట. ఎంతైనా పవన్ కు ఇష్టమైన మేనల్లుడు కదా మరీ.. ఆ మాత్రం కేరింగ్ ఉంటుంది. మరి పవన్ కు తొలిప్రేమతో బ్లాక్‌బస్టర్‌ హిట్ ఇచ్చిన కరుణాకరన్ తేజ్ కు కూడా అలాంటి టర్నింగ్ ఇస్తారో..? లేదో చూద్దాం..?


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.