English | Telugu

ట్రైలర్ లేకుండానే అజ్ఞాతవాసి రిలీజవుతుందా..?

on Jan 6, 2018

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంభినేషన్‌లో తెరకెక్కిన అజ్ఞాతవాసి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి సంబంధించి ప్రతి విషయంలోనూ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. గతంలో ఫస్ట్‌లుక్, టైటిల్ కోసం అభిమానులు చాలా రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తరువాత టీజర్, ఆడియోను రిలీజ్ చేసినా.. ట్రైలర్ మాత్రం విడుదల చేయలేదు. అభిమానుల్లో హైప్ పెంచేందుకని.. మార్కెటింగ్ స్ట్రాటజీ అని ఇలా చాలా వార్తలు వినిపించాయి. ఇవాళ.. రేపు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా ట్రైలర్ మాత్రం బయటకి రాలేదు. జనవరి 10కి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండటంతటో అసలు అజ్ఞాతవాసి ట్రైలర్‌ను చూస్తామా అంటూ అభిమానులు తెగ బెంగపడిపోతున్నారు.

అయితే థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయినా.. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తికాని కారణంగానే ట్రైలర్ విడుదల చేయలేదన్న ప్రచారం జరుగుతోంది. సెన్సార్ అధికారి మారడం దానికి తోడు దర్శక నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం కూడా ఆలస్యానికి కారణమైందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో ట్రైలర్ వస్తుందో రాదో అనే విషయంపై అజ్ఞాతవాసి యూనిట్ వర్గాలు కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయి. అయితే శని, ఆదివారాల్లో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారేమోనన్న చిన్న నమ్మకంతో ఉన్నారు పవన్ అభిమానులు. మరి వారి కోరిక ఎంత వరకు తీరుతుందో వేచి చూడాలి.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here