క్లాప్ కొట్టేప్పుడు పవన్ సూపర్ కామెడీ.. ఏమన్నాడో తెలుసా...?
on Oct 24, 2017
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో కొత్త సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా జరిగిపోయింది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ నవ్వుల పువ్వులు విరిశాయి. దానికి కారణం పవన్ కామెడీ చేయడమే. ముహూర్తపు షాట్ ను దేవుడి పటాలకు ఎన్టీఆర్ మొక్కుతున్న సన్నివేశంపై తీశారు. ఇక అతిధిగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. అయితే క్లాప్ బోర్డ్ పట్టుకున్న పవన్... "క్లాప్ కొట్టేటప్పుడు ఏం చెప్పాలి? నాకు అసలే భయం. చేతులు వణుకుతున్నాయి" అని అన్నారు. ఇక పవన్ అన్న ఆ మాటలకు ఎన్టీఆర్ తో పాటు అక్కడ ఉన్నవారంతా పడి పడి నవ్వారు. ఆ తర్వాత 'యాక్షన్' అని చెప్పి మోకాళ్ల మీద కూర్చున్నారు. అనంతరం ఎన్టీఆర్ ను పవన్ కౌగిలించుకుని, అభినందనలు తెలిపారు. ఆ తరువాత కాసేపు సరదాగా ముచ్చటించారు. దీంతో వీరిద్దరూ అంత సన్నిహితంగా ఉండటం చూసిన అభిమానులు కూడా సంతోషంలో మునిగితేలారు.